Sunday 8 September 2013

కత్రినా, దీపిక అంటే నాకెందుకంత ఇష్టం?

జిందగీ నా మిలేగీ దోబారా (2011), యే జవానీ హై దీవానీ (2013) - రెండూ మంచి 'ట్రెండీ' సినిమాలు. వీటిలో మొదటిది ట్రెండీ రొమాంటిక్ డ్రామా రోడ్ స్టోరీ. రెండోది ట్రెండీ సెన్సిటివ్ రొమాంటిక్ స్టోరీ. జోయా అక్తర్, అయన్ ముఖర్జీ ఈ చిత్రాల దర్శకులు.

వీటి స్టార్‌కాస్టింగ్, బడ్జెట్లు అత్యంత భారీవి. రెండూ బాక్సాఫీసుల రికార్డుల్ని బ్రేక్ చేశాయి. విచిత్రంగా, ఈ రెండు సినిమాలూ హార్డ్‌కోర్ క్రిటిక్స్ చేత కూడా మంచి రివ్యూల్ని రాయించుకోగలిగాయి!

నిజానికి పైవేవీ నేనీ బ్లాగ్ పోస్ట్ రాయడానికి కారణం కాదు. ఈ రెండు చిత్రాల్లో అద్భుతంగా, అత్యంత సహజంగా చిత్రీకరించిన నేటితరం యువత జీవనశైలి, కొన్ని మర్చిపోలేని పాత్రల సృష్టి - ఇవీ నేనీ బ్లాగ్ పోస్ట్ రాయడానికి అసలు కారణం.

ప్రతి పాత్రకు ఒక వ్యక్తిత్వం, ఇండివిడ్యువాలిటీ ఉండటం ఈ రెండు చిత్రాల స్క్రీన్‌ప్లేల గొప్పదనం.

జిందగీ నా మిలేగీ.. చిత్రంలో కత్రినా కైఫ్ నటించిన లైలా పాత్ర, యే జవానీ హై.. చిత్రంలో దీపికా పడుకొనే నటించిన నైనా పాత్రలు ఈ మధ్యకాలంలో నన్ను అమితంగా ప్రభావితం చేసిన పాత్రలు. ఎందుకో - ఈ రెండు సినిమాలు చూస్తే అర్థమవుతుంది.

జీవితాన్నీ, జీవితంలోని అనేక సున్నితత్వాల్ని ఇష్టపడేవారికీ, వాటికోసమే జీవించేవారికీ ఈ పాత్రలు బాగా గుర్తుండిపోతాయి.

"రేపు నువ్వు బ్రతికుంటావని నమ్మకం ఏంటి? ఇప్పుడు నీ కళ్లముందున్న ఉన్న ఈ క్షణాన్ని జీవించు, మై ఫ్రెండ్!" అని చెప్తుంది లైలా పాత్ర.

తను ప్రేమించినంత మాత్రాన, ఎదుటివ్యక్తి తన సృజనాత్మక జీవనశైలిని కోల్పోనవసరం లేదని చెప్పే "హద్దులు పెట్టని" ప్రేమకి నిజమైన నిర్వచనం ఇస్తుంది నైనా పాత్ర.

అద్భుతమైన ఈ రెండు పాత్రల్ని సృష్టించిన దర్శకులు జోయా, అయన్ లను ఎలా మర్చిపోగలను? నా ఆలోచనల్ని అమితంగా డిస్టర్బ్ చేసిన ఈ రెండు పాత్రల్లో అలవోకగా జీవించిన కత్రినా, దీపికలను ఎలా ఇష్టపడకుండా ఉండగలను? 

2 comments:

  1. నేను ఆ రెండు సినిమాలూ చూడలేదు!ఆయా పాత్రలను రూపకల్పన చేసిన దర్శకులకు కూడా మీ పొగడ్తలలో సగం చెందుతాయి!

    ReplyDelete
    Replies
    1. "అద్భుతమైన ఈ రెండు పాత్రల్ని సృష్టించిన దర్శకులు జోయా, అయన్ లను ఎలా మర్చిపోగలను?"..
      అంటూ - ఆ ఇద్దరు దర్శకులను ముందే పొగడ్తలతో ముంచెత్తాను! :)

      Delete